![]() |
![]() |

యాంకర్ గా కెరీర్ ని ప్రారంభించి'వికీ డోనర్' సినిమాతో హీరోగా మారిన బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా(Ayushmann Khurrana).ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి అశేష ప్రేక్షాభిమాన్ని పొందిన ఆయుష్మాన్ 2008లో ప్రముఖ రచయిత్రి,నిర్మాత,దర్శకురాలు తాహిర కశ్యప్(Tahira Kashyap)ని పెళ్లి చేసుకున్నాడు.
తాహిరా రీసెంట్ గా తాను రొమ్ము కాన్సర్ తో పోరాడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపింది.దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రొమ్ము కాన్సర్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది.రోజు ఆరోగ్యంపై శ్రద్ద పెడుతు,ఎన్ని సమస్యలు ఎదురైనా సానుకూలంగా ముందుకెళ్లాలనే వ్యాఖ్యలని కూడా జోడించారు.తాహిరా త్వరగా కోలుకోవాలని సోనాలి బింద్రే,గుణిత్ మోంగా,ట్వింకిల్ ఖన్నావంటి తదితర తారలు తమ ఇనిస్టా అకౌంట్ లో పోస్ట్ చేస్తున్నారు.
తాహిరా గతంలో రొమ్ము క్యాన్సర్ బారిన పడినప్పుడు కూడా దానికి సంబంధించిన చికిత్స తీసుకుంటూనే ఆ విషయం గురించి సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటు ఉండేది.

![]() |
![]() |